- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Allu Arjun- DSP: దేవీశ్రీ ప్రసాద్‌పై ఐకాన్ స్టార్ ప్రశంసల వర్షం.. డీఎస్పీ రియాక్షన్ ఇదే
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పుష్ప 2’. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇండియాస్ ఫేమస్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్‌తో అలరించనుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అన్ని సినిమా పై మంచి హైప్‌ను తెచ్చిపెట్టాయి. దీంతో ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్ల బిజీలో ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిత్రబృదం కొచ్చిలో ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌పై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఐకాన్ స్టార్ మాట్లాడుతూ.. 'నాకెంతో ఇష్టమైన దేవీశ్రీ ప్రసాద్‌కు స్పెషల్ థాంక్స్. నా కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. బన్నీ, ఆర్య, పుష్ప, పుష్ప 2 వంటి చిత్రాల్లో మంచి పాటలు ఇచ్చారు. థాంక్యూ మైడియర్ ఫ్రెండ్' అని అన్నారు. ఈ స్పీచ్‌ను దేవీశ్రీప్రసాద్ షేర్ చేస్తూ 'థాంక్స్ బన్నీ బాయ్.. ఐకాన్ స్టార్' అని పేర్కొన్నారు.