- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కస్టమర్లే దేవుళ్ళు’.. వినూత్న ఆలోచనతో దూసుకెళ్తున్న వ్యాపారులు!
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో వ్యాపారం(business)లో దూసుకెళ్లాలంటే వినూత్న పద్ధతిలో ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. టెక్నాలజీకి అనూకులంగా అడుగులు పడితేనే బిజినేస్ లో లాభాలు వస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో డబ్బుంటే ఏదైనా వెతుక్కుంటూ చెంతకే వస్తుందనేలా ప్రస్తుతం విలీన మండలాల్లో దృశ్యాలను చూస్తే తెలుస్తుంది. ఇటీవల పునరావాస పరిహారంగా పోలవరం నిర్వాసితుల ఖాతాల్లో రూ.40 కోట్లు జమైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వ్యాపారుల దృష్టి ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలపై పడింది. దీంతో వ్యాపారులు స్థానికంగా తమ ఉత్పత్తులు విక్రయించే ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో ద్విచక్ర వాహనం కొనాలంటే భద్రాచలం, అశ్వారావు పేట, జంగారెడ్డి గూడెం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వాహనాలను వ్యాపారులు గ్రామాలకే తెస్తున్నారు. ఇంటి దగ్గరే బండిని అప్పగించి రిజిస్ట్రేషన్ పనులన్నీ అక్కడే పూర్తి చేసి వెళతామని డీలర్లు చెబుతున్నారు. వ్యాపారులు కస్టమర్ల వద్దకు వచ్చి వినియోగించడం పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.