Weather Report: పెరుగుతోన్న చలి.. ఊపిరి తీస్తోన్న గాలి.. మరో ఢిల్లీ అవుతుందా ?

by Rani Yarlagadda |
Weather Report: పెరుగుతోన్న చలి.. ఊపిరి తీస్తోన్న గాలి.. మరో ఢిల్లీ అవుతుందా ?
X

దిశ, వెబ్ డెస్క్: చలి పంజా విసురుతోంది. ఉదయం 8 గంటలు కాదు కదా.. మధ్యాహ్నం 12 గంటలైనా సరే.. బయటికి రావాలంటే జంకుతున్నారు ప్రజలు. అయినా ఆఫీసులు, కాలేజీలకు వెళ్లక తప్పుతుందా అనుకుంటూ.. స్వెట్టర్లు వేసుకుని, టోపీలు, మఫ్లర్లు పెట్టుకుని బతుకు జీవుడా అంటూ పోతున్నారు. ఇది తెలంగాణలో పరిస్థితి. 24 గంటలూ చలి చంపేస్తోంది. చలి గాలి కారణంగా.. కొందరికి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 9.4, గుమ్మడిదలలో 9.5 డిగ్రీలు, మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. సిద్ధిపేట జిల్లా కొండపాకలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ముఖ్యంగా హైదరాబాద్ లో కాలుష్యం పెరిగిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఏక్యూఐ 120 పాయింట్లలోపే ఉందని, ఇప్పుడే జాగ్రత్త పడకపోతే.. భాగ్యనగరం మరో ఢిల్లీ అవుతుందని హెచ్చరించారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో కాలుష్యం భయపడే పరిస్థితి లేదు కానీ.. డేంజర్ జోన్ కి దగ్గరగా ఉందన్నారు ప్రసన్న కుమార్. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోందని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి.. వాటి వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రతి చిన్న అవసరానికీ వాహనాలను వాడుతుండటంతో కాలుష్యం పెరుగుతుందన్నారు. కాగా.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించే యోచనలో ఉన్న సర్కార్ కొత్త ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story