Tragedy: పెళ్లి వేడుకలో విషాదం నింపిన డీజే వెహికల్

by Rani Yarlagadda |
Tragedy: పెళ్లి వేడుకలో విషాదం నింపిన డీజే వెహికల్
X

దిశ, వెబ్ డెస్క్: ఎంతో సంతోషంగా.. నవ్వులతో, పిల్లల అల్లరితో సందడిగా ఉండాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. డీజే వెహికల్.. పెళ్లి వేడుకలో విషాదాన్ని నింపింది. కర్నూల్ జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెంలో.. నవ వధూవరుల వరుల వాహనాన్ని డీజే వెహికల్ ఢీ కొట్టడంతో.. ఏడేళ్ల బాలుడు మనోజ్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో బంధువులు డీజే వాహన డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనం అద్దాలను పగులగొట్టారు. డ్రైవర్ పై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బాలుడిని పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story