IT Raids: మాజీ మంత్రి పీఏ ఇళ్లలో ఐటీ రెయిడ్స్..

by Shiva |   ( Updated:2024-11-28 03:50:55.0  )
IT Raids: మాజీ మంత్రి పీఏ ఇళ్లలో ఐటీ రెయిడ్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం (YCP Government)లో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ అధికారులు (Income Tax Officials) ఫొకస్ పట్టారు. పదవిలో ఉన్నంత కాలం సంపాదించిన ఆస్తులపై ఆరా తీస్తూ.. వాళ్ల ఇళ్లలో వరుసగా సోదాలు చేపడుతున్నారు. తాజాగా, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) పీఏ మురళి (Murali) నివాసాల్లో ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కృష్ణదాస్‌ (Krishna Das)కు మురళి ప్రభుత్వ పీఏగా విధులు నిర్వర్తించారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐటీ దాడులు (IT Raids) జరుగుతున్నాయి. కోటబొమ్మాళి (Kotambommali) మండల పరిధిలోని దంత గ్రామంతో పాటు లింగనాయుడిపేట, విశాఖపట్నం (Vishakhapatnam)లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం మురళి హెల్ట్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

Next Story