- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ అవుట్ .. సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని షాక్ ఇచ్చిన అవినాష్?
దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 (bigg boss 8) రసవత్తరంగా సాగుతుంది. అయితే, ఈ వారం ఎవరూ ఉహించని విధంగా నయని సేవ్ అయి మెహబూబ్ (Mehabooba) ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఎమోషనల్ అవుతూ " అంతక ముందు దీపావళి పండుగ సమయంలోనే బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యా. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. అసలు అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్ధం కావడంలేదు. ప్రతి టాస్క్‌లోనూ నేను బెస్ట్ గానే ఇచ్చా.. అయిన కూడా హౌస్ లో నిలవలేకపోయా..’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మెహబూబ్.
ఇప్పుడు ఎనిమిదో సీజన్ లో వైల్డ్‌కార్డ్‌తో ఎంట్రీతో అడుగు పెట్టాడు. ఇంటి నుంచి వెళ్లిపోయేముందు మెహబూబ్ హౌస్‌మేట్స్‌ను పటాకాలతో పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవినాష్ ధౌజండ్‌వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్, నబీల్ రాకెట్, రోహిణి కాకరబత్తి, గౌతమ్ మ్యాచ్ స్టిక్ అన్నాడు.
అవినాష్ ఎలిమినేట్?
ఇక రేపటి ప్రోమోలో అవినాష్( avinash)హెల్త్ సపోర్ట్ చేయకపోవడంతో సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నట్లు చూపించారు. మెడికల్ రూమ్‌కు హెల్త్ చెక్ అప్ కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. అయితే, అప్పుడు వెళ్లిపోతున్నాను అంటూ అందరికీ బై చెప్పాడు. హాస్పిటల్‌కు వెళ్లి మళ్లీ తిరిగివస్తాడా లేక నిజంగానే వెళ్లిపోతాడనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.