- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మూడు రోజుల పాటు తెలంగాణలో రాహుల్, ప్రియాంక ప్రచారం.. షెడ్యూల్ ఫిక్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారాన్ని మొదలుపెట్టగా.. కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్దమవుతోంది. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపు మూడు రోజుల పాటు ఇద్దరూ ప్రచారం చేయనున్నారు. వీరి పర్యటన వివరాలను టీ కాంగ్రెస్ ఆదివారం వెల్లడించింది.
రాష్ట్రంలో రాహుల్, ప్రియాంక మూడు రోజులు పర్యటిస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. ఈ నెల 18,19,20వ తేదీలలో పర్యటన ఉంటుందని, ములుగు జిల్లా నుంచి బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు. పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ ఉంటుందని, కరీంనగర్‌లో పాదయాత్ర, బహిరంగ సభ ఉంటాయని స్ఫష్టం చేశారు. జగిత్యాలలో రైతులతో రాహుల్ మాట్లాడతారని, నిజామాబాద్‌లో పాదయాత్ర, బహిరంగ సభ ఉంటాయని చెప్పారు. ఆర్మూర్‌లో కూడా రైతులతో రాహుల్ సమావేశం ఉంటుందని ఠాక్రే తెలిపారు.
ఈ నెల 18వ తేదీ నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాహుల్ గాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యనేతలు, స్థానిక నేతలు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది.