- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పుష్ప 2 సినిమా టికెట్ల ధరల పెంపు హైకోర్టులో విచారణ

దిశ, తెలంగాణ బ్యూరో : పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన బెనిఫిట్ షో టికెట్ల ద్వారా వచ్చిన డబ్బులను సీఎం రిలీఫండ్ కు , పిఎం కేర్ కు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనాన్ని పిటిషనర్ సతీష్ కమల్ తరపున అడ్వకేట్ పాడూరి శ్రీనివాసరెడ్డి అభ్యర్ధించారు. డిసెంబర్ 4 వ తేదిన బెనిఫిట్ షో టికెట్ల పై ప్రస్తుత ధరల కంటే రూ.800 అధనంగా వసూలు చేసినట్లు కోర్టుకు వివరించారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై సతీష్ కమల్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. పిటిషన్ పై జస్టీస్ వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. పుష్ప 2 సినిమాకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షో ద్వారా అమ్మిన టిక్కెట్లు , బెనిఫిట్ షో కోసం అందుకున్న మొత్తం వంటి పూర్తి డేటా అవసరం అని పిటిషనర్ తరపు అడ్వకేట్ తెలిపారు.
2025 - 26 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో అమ్ముడైన టిక్కెట్ల పూర్తి బెనిఫిట్ షో వివరాలు, చెల్లించిన జీఎస్టీ, ముందస్తు ఆదాయపు పన్ను వంటి పన్నులతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించాలని అడ్వకేట్ పాదూరి శ్రీనివాస రెడ్డి కోర్టును కోరారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. జస్టిస్ టి వినోద్ కుమార్ రెండు వారాల సమయం ఇస్తున్నట్లు తెలుపుతూ కేసును ఏప్రిల్ 1, 2025న వాయిదా వేశారు. తమ న్యాయ పోరాటం సినిమా ప్రేక్షకులకు పూర్తి న్యాయం చేకూరుస్తుందని, చిత్ర పరిశ్రమలో సంస్కరణలను తీసుకువస్తుందని అడ్వకేట్ పాడూరి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.