- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa 2: పుష్ప-2 నిర్మాతలపై కేసు.. ఎఫ్ఐఆర్ లో A18 గా మైత్రీ మూవీ మేకర్స్
దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాటSandhya Theater stampede) ఘటనపై పోలీసులు పుష్ప-2 సినిమా నిర్మాతలపై(Pushpa-2 movie producers) కూడా కేసు(case) నమోదు చేశారు. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో(FIR) మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ని A18 గా చేర్చారు. పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా చిత్రనటుడు అల్లు అర్జున్(Allu Arjun) సంధ్య థియేటర్ కు రావడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందగా.. మరో బాలుడు ప్రాణపాయ స్థితిలో(life-threatening condition) చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసులు ఈ కేసులో పుష్ప-2 చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ పేరును కూడా చేర్చారు. A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ పేర్లను, A9, A10 సంధ్య థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్‌చార్జ్ పేర్లను చేర్చగా.. A11గా సినీ నటుడు అల్లు అర్జున్ పేరును చేర్చారు. అంతేగాక A12 నుంచి A17వరకు అల్లు అర్జున్ బౌన్సర్ల పేర్లను చేర్చిన పోలీసులు.. A18గా మైత్రి మూవీమేకర్స్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. దీంతో ఈ కేసులో మైత్రీ మూవీమేకర్స్ నిర్వాహకులు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితులు.
- A1 అగమాటి పెదరామిరెడ్డి.. థియేటర్ ఓనర్
- A2 అగమాటి చిన్నరామిరెడ్డి.. థియేటర్ ఓనర్
- A3 ఎం.సందీప్, పార్ట్‌నర్
- A4 సుమిత్, పార్ట్‌నర్
- A5 అగమాటి వినయ్, పార్టనర్
- A6 అశుతోశ్‌రెడ్డి, పార్ట్‌నర్
- A7 రేణుకాదేవి, పార్టనర్
- A8 అరుణారెడ్డి, పార్ట్‌నర్
- A9 నాగరాజు, మేనేజర్
- A10 విజయ్‌చందర్, లోయర్ బాల్కానీ ఇన్‌చార్జ్
- A11 అల్లు అర్జున్, పుష్ప హీరో
- A12 సంతోశ్, అల్లు అర్జున్ పీఏ
- A13 శరత్‌బన్నీ, అల్లు అర్జున్ మేనేజర్
- A14 రమేశ్, సెక్యూరిటీ టీమ్
- A15 రాజు, సెక్యూరిటీ టీమ్
- A16 వినయ్ కుమార్, ఫ్యాన్స్ అసోసియేషన్
- A17 ఫర్వేజ్, బాడీగార్జ్
- A18 మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్స్
Read More...
అల్లు అర్జున్ జైలుకు పోవడం ఖాయం.. అడ్వకేట్ పోడూరి సంచలన వ్యాఖ్యలు