శిలాఫలకంలో బీజేపీ ఎమ్మెల్సీ పేరు మాయం.. ఎమ్మెల్యేపై డీకే అరుణ సీరియస్

by Gantepaka Srikanth |
శిలాఫలకంలో బీజేపీ ఎమ్మెల్సీ పేరు మాయం.. ఎమ్మెల్యేపై డీకే అరుణ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా మక్తల్‌లో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. నర్వ ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యక్రమంలో శనివారం ఈ రగడ జరిగింది. శిలా ఫలకంలో బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి పేరు లేకపోవడంతో స్థానిక ఎంపీ డీకే అరుణ సీరియస్ అయ్యారు. ఇదే విషయమై ఎమ్మెల్యే శ్రీహరిని అరుణ నిలదీశారు. దీంతో పరస్పరం బీజేపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story