సీఎం కేసీఆర్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్ సపోర్ట్.. కేంద్రం తీరుపై ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-08 10:52:45.0  )
సీఎం కేసీఆర్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్ సపోర్ట్..  కేంద్రం తీరుపై ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. తనకు గౌరవం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మీడియా వేదికగా బహిరంగంగా విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు చేస్తుండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలో దీనిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. గవర్నర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ఆయనను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరని ప్రశ్నించారు. తమను ఎవరు పాలించాలనేది తెలంగాణ ప్రజలను నిర్ణయిస్తారని, కేంద్ర ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story