'విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి'.. సంక్షేమ భవన్ ఎదుట ధర్నా

by Vinod kumar |
విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. సంక్షేమ భవన్ ఎదుట ధర్నా
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా మారిందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల హాస్టళ్లను నిర్వీర్యం చేస్తున్నారని, ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని మండిపడ్డారు.

వర్షాకాలమైనప్పటికీ దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో చలికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సంక్షేమ హాస్టళ్ల లో కనీసం తాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. సంక్షేమ హాస్టల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు డీజే శివ గౌడ్, పోల్కార్ సాయిరాం, మచ్చ సైదులు, అధికార ప్రతినిధులు అమరేందర్, చీమ మహేష్, నకిరేకంటే గణేష్, రవీందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story