- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రుణమాఫీ చేసేందుకు సర్కారు అంగీకరించదు.. ప్రియాంకగాంధీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాండూరు జనజాతర సభలో ప్రియాంక గాంధీ శనివారం పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అంటే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. ఇందిరాగాంధీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ తర్వాత సోనియమ్మపై ఇక్కడి ప్రజలు అభిమానం చూపించారని తెలిపారు. దేశ ప్రజలు చెప్పే సమస్యలు వినడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్ నేతలు భావిస్తారన్నారని తెలిపారు.
రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేమీ ఉండవన్నారు. యూపీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉందని.. రూ.1200 గ్యాస్ సిలిండర్‌ను తెలంగాణలో రూ.500లకే ఇస్తున్నారన్నారు. రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయదన్నారు. బీజేపీ పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయన్నారు. పేద రైతులు రూ.50 వేలు, రూ.లక్షల రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు బీజేపీ సర్కారు అంగీకరించదన్నారు.