- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన విజయవంతం
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన విజయవంతం అయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. ప్రధాని పర్యటించిన రెండ్రోజులు రెండు డిజిటల్ క్యాంపెయిన్స్ చేపట్టామని అన్నారు. మొదటిది ‘మన మోడీ’, రెండోది ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ అని చెప్పారు. ఈ రెండింటిపై జనాల్లో చర్చ జరిగిందని అన్నారు. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజలకు క్లారిటీ వచ్చిందని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేక తరచూ బీఆర్ఎస్‌పై విమర్శలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. గెలిచే అవకాశం లేదని భావించి అమలుకు సాధ్యం కానీ, హామీలు ఇచ్చారని.. అనూహ్యంగా అధికారంలోకి రావడంతో అమలు చేయడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గ్యారంటీలన్నీ ప్రకటనలకే పరిమితం అయ్యాయని అన్నారు.