హకీంపేట చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఒకే వేదికపై కేసీఆర్, గవర్నర్ తమిళిసై

by Satheesh |   ( Updated:2022-12-26 13:59:19.0  )
హకీంపేట చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఒకే వేదికపై కేసీఆర్, గవర్నర్ తమిళిసై
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో శీతాకాల నిడివి నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేటకు చేరుకున్నారు. తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, టీ- బీజేపీ చీఫ్ బండి సంజయ్, పలువురు బీఆర్ఎస్ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రతినిధులను సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి పరిచయం చేశారు. శీతాకాల నిడివికి వచ్చిన ద్రౌపది ముర్ము ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. కాగా, గతకొంత కాలంగా దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించారు.

Advertisement

Next Story