ఏషియన్ థియేటర్లో పవర్ కట్! రంగంలోకి పోలీసులు..

by Ramesh N |
ఏషియన్ థియేటర్లో పవర్ కట్! రంగంలోకి పోలీసులు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినిమా థియేటర్‌లో పవర్ కట్ ఘటన ఆందోళనకు దారి తీసింది. శుక్రవారం ఉప్పల్ ఏషియన్ థియేటర్ లో ‘గామీ’ సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. రాత్రి 7 గంటల 30 నిమిషాల షో నడుస్తుండగా మధ్యలో పవర్ సమస్య వచ్చింది. దీంతో కరెంట్ వెంటనే వస్తుందని భావించిన ప్రేక్షకులు వెయిట్ చేశారు. అయిన కరెంట్ రాకపోవడంతో ప్రేక్షకులను బయటకు పంపించారు. దీంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు.

పవర్ ప్రాబ్లం ఉన్నా కూడా 10 గంటల 20 నిమిషాలకు ప్రేక్షకులకు టికెట్ అమ్మి షో వేయకపోవడంతో థియేటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే థియేటర్ దగ్గరికి వచ్చి ప్రేక్షకులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింప చేయిస్తారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు మనీ రీఫండ్ చేయిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పవర్ కట్స్ బాగా పెరిగాయని నెటిజన్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు జనరేటర్స్, ఇన్వేటర్లు పెట్టుకోవాలని సూచించారు.

Advertisement

Next Story