Breaking: రేపటి T-బీజేపీ మహాధర్నా వాయిదా.. ఎందుకంటే..?

by Satheesh |   ( Updated:2023-07-24 15:58:37.0  )
Breaking: రేపటి T-బీజేపీ మహాధర్నా వాయిదా.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సోమవారం రాత్రి కుంభవృష్టి వర్షం కురిసింది. దాదాపు అర్థగంట పాటు కురిసిన ఈ భారీ వర్షానికి నగరం మొత్తం జలమయమైంది. వర్షపు నీటితో దాదాపు నగరంలోని రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. అయితే, హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మి్స్తోన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వైఫల్యాలను ఎండగట్టేందుకు రేపు (మంగళవారం) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. అయితే, నగరంలో సోమవారం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ధర్నాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. కాగా, బీజేపీ పిలుపునిచ్చిన ఈ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే.. హైకోర్టు కెళ్లి అనుమతి తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story