Ponnam: కులగణన సర్వే రచ్చ.. బీఆర్ఎస్, బండి సంజయ్ పై పొన్నం కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Ponnam: కులగణన సర్వే రచ్చ.. బీఆర్ఎస్,  బండి సంజయ్ పై పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) విస్తృత స్థాయి సమావేశంలో కులగణనను ఓ ఎజెండాగా తీసుకుని బలహీవర్గాలకు మద్దతుగా నిలవాలని బీఆర్ఎస్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కులగణన సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోని వారి కోసం ఈ నెల 16వ తేది నుండి 28వ తేదీ వరకు మరోసారి ప్రభుత్వం కలుగణన సర్వే (Caste Census Survey) నిర్వహిస్తున్నదని వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్పేలా తొలుత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సర్వేలో పాల్గొనాలని ఆ తర్వాత ప్రజలు భాగస్వామ్యులు అయ్యే విధంగా ఇవాళ జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఎజెండా గా పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. రీ సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పాల్గొనకుండా కేవలం విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.

మూడు పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగిందని దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో ఇప్పటి వరకు తమ వివరాలు ఇవ్వని వారు ఇప్పుడు సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మొదటి విడత కుల సర్వే మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేసి సర్వేలో భాగస్వాములు అయ్యేవిధంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సర్వేలో భాగస్వామ్యులై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని కోరారు.

ఆ బాధ్యత బండి సంజయ్ దే:

బీసీ రిజర్వేషన్లపై రాజకీయం చేస్తోందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో చేయబోయే చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప జేసే బాధ్యత బండి సంజయ్ (Bandi Sanjay) దేనన్నారు. ముస్లింలను బీసీల్లో కలిపితే ఒప్పుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు. కులగణనపై తెలంగాణలోని బీసీలంతా సమర్థిస్తున్నారన్నారు. బీజేపీ పార్టీనే రిజర్వేషన్లకు వ్యతిరేకం అని నాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ పాలిటిక్స్ కు తెరలేపిందే బీజేపీ అని విమర్శించారు.

Next Story

Most Viewed