BRSలోకి పొన్నాల.. భేటీ తర్వాత KTR క్లారిటీ!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-14 09:36:55.0  )
BRSలోకి పొన్నాల.. భేటీ తర్వాత KTR క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మాజీ పీసీసీ చీఫ్, ఎక్స్ మినిస్టర్ పొన్నాల ఇంటికి వెళ్లి మంత్రి కేటీఆర్ శనివారం భేటీ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించామన్నారు. ఆయనకు తగిన గౌరవం ఇస్తామన్నారు. పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ తీరును అంతా చీదరించుకుంటున్నారన్నారు. చచ్చే ముందు పార్టీ మారడం ఏంటని పొన్నాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు. ఈ నెల 16న కేసీఆర్ సభలో పొన్నాల పార్టీలో చేరుతారన్నారు. 45 ఏళ్లు పని చేసిన సీనియర్ నాయకులకు కూడా కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయన్నారు. పార్టీలో చేరేందుకు పొన్నాల సుముఖత వ్యక్తం చేశారన్నారు.

Advertisement

Next Story