తుమ్మల ఇలాకాలో నేడు పొంగులేటి కీలక సమావేశం

by GSrikanth |
తుమ్మల ఇలాకాలో నేడు పొంగులేటి కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గమైన పాలేరులో నేడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. తన అనుచరులు, అభిమానులతో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిసున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత పొంగులేటి సొంతంగా అడుగులు వేస్తున్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన కేడర్‌ను మచ్చిక చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 5 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించిన ఆయన, నేడు పాలేరులో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మిగిలిన మరో నాలుగు నియోజవర్గాల్లో అతి త్వరగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి, భవిష్యత్ కార్యచరణ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story