- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాలుగు గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ.. కారణమిదే..!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో తెలంగాణలో 9.48 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే తెలంగాణలోని నాలుగు గ్రామాల ప్రజలు మాత్రం పోలింగ్‌ను బహిష్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామస్తులు ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మంచలేదని పోలింగ్ బహిష్కరించారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామస్తులు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాని ధర్నాకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తగ్గేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామస్తులు సైతం తమ ఊరిరోడ్డు సమస్యను తీర్చాలని ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో మైనింగ్ ఎన్‌వోసీ అనమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పోలింగ్ వేళ నాలుగు గ్రామాల ప్రజల నిర్ణయం సంచలనంగా మారింది.