- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chikoti Praveen : చీకోటి ప్రవీణ్‌కు బిగ్ షాక్.. ప్రైవేట్ గన్మెన్ల కేసులో కొత్త ట్విస్ట్..!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో/చార్మినార్: చీకోటి ప్రవీణ్ప్రైవేట్ గన్మెన్ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ ముందుకొచ్చింది. ఈ కేసులో ఛత్రినాక పోలీసులు చీకోటి ప్రవీణ్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్నమోదు చేశారు. దాంతో పాటు సెక్షన్లను కూడా మార్చారు. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్కూడా ఒకటి రెండు రోజుల్లో అరెస్టు కావటం ఖాయమని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఆదివారం బోనాల పండుగను పురస్కరించుకుని లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు చీకోటి ప్రవీణ్వచ్చిన విషయం తెలిసిందే. వస్తూ వస్తూ అతను తన వెంట ప్రయివేట్గన్ మెన్లను తెచ్చుకున్నాడు.
మందిరం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వరకు గన్మెన్లతో కలిసి వచ్చాడు. అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు చీకోటి ప్రవీణ్‌తో పాటు వచ్చిన సుందర్నాయక్, రమేశ్‌గౌడ్, రాకేశ్కుమార్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించటంతో అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా వారి వద్ద పిస్టళ్లు దొరికాయి. దాంతో ముగ్గురిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో ముగ్గురిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన ఛత్రినాక పోలీసులు వారి వద్ద ఉన్న పిస్టళ్లకు సంబంధించిన లైసెన్సులను చూపించమని అడిగారు.
దానికి ముగ్గురూ పొంతన లేని సమాధానాలు చెప్పటంతో పోలీసులు మరింత క్షుణ్నంగా విచారణ జరిపారు. దీంట్లో సుందర్నాయక్, రమేశ్‌గౌడ్, రాకేశ్కుమార్ల వద్ద ఉన్నవి ఫోర్జరీ లైసెన్సులని వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురిపై ఐపీసీ 420, 467, 468, 471 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా తన వద్ద గన్మెన్లుగా ఉన్నవారిని పోలీసులు అరెస్టు చేయటంపై స్పందిస్తూ చీకోటి ప్రవీణ్తన ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలోనే వారిని భద్రత కోసం నియమించుకున్నట్టు మీడియాతో చెప్పారు.
పోలీసులు ఓవరాక్షన్చేసి తన గన్మెన్లను అరెస్టు చేశారంటూ వ్యాఖ్యానించాడు. కాగా, చట్టరీత్యా ప్రైవేట్‌వ్యక్తులు గన్మెన్లను పెట్టుకోవటానికి అనుమతి లేని నేపథ్యంలో తాజాగా ఛత్రినాక పోలీసులు సోమవారం చీకోటి ప్రవీణ్‌ను కేసులో ప్రధాన నిందితునిగా చేరుస్తూ ఎఫ్ఐఆర్జారీ చేశారు. ఇక, చీకోటి ప్రవీణ్‌తో పాటు సుందర్నాయక్, రమేశ్‌గౌడ్, రాకేశ్కుమార్లపై ఐపీసీ 420, 109 సెక్షన్లతోపాటు ఆయుధాల నిరోధక చట్టం సెక్షన్25, 30 ప్రకారం కేసులు నమోదు చేశారు. దీనిపై పోలీసు అధికారులతో మాట్లాడగా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్గన్మెన్లను పెట్టుకున్న నేపథ్యంలోనే చీకోటి ప్రవీణ్‌ను కేసులో ప్రధాన నిందితునిగా చేర్చినట్టు వెల్లడించారు. త్వరలోనే అతన్ని అరెస్టు కూడా చేస్తామన్నారు.
Read more : మరో వివాదంలో చికోటి ప్రవీణ్