- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశం
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మందుబాబులకు హైదరాబాద్ నగర పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఎల్లుండి(23-04-2024) హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే మద్యం విక్రయాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్వదినాలు, పండుగ దినాల్లో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎలాంటి వివాదాలు, మత ఘర్షణలకు తావు ఉండకూడదని పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
Next Story