కాపుగల్లులో పడగ విప్పిన విషజ్వరాలు.. ప్రతి ఇంట్లో ముగ్గురు బాధితులు

by Anjali |   ( Updated:2023-05-18 04:57:20.0  )
కాపుగల్లులో పడగ విప్పిన విషజ్వరాలు.. ప్రతి ఇంట్లో ముగ్గురు బాధితులు
X

దిశ, కాపుగల్లు: మండలంలోని కాపుగల్లు గ్రామ ప్రజలను విషజ్వరాలు ఆవహించాయి. గత వారం రోజులుగా గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రజలు విష జ్వరాల బారిన పడ్డారు. ప్రతి ఇంట్లో ముగ్గురు జ్వర పీడితులు ఉన్నారు. వీరందరిలో వేర్వేరు లక్షణాలు బయటపడుతున్నాయి. కొందరిలో కీళ్ల నొప్పులు ఉండగా మరి కొందరిలో కాళ్ళు, చేతుల వాపులు కనిపిస్తున్నాయి. పిల్లల్లో 103 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుండగా ఫీట్స్ వస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవాళ్ళలో కీళ్ల నొప్పులు, వాపులు నడవలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

రక్త పరీక్షల్లో రిపోర్ట్స్ నార్మల్‌గా వస్తున్నాయని అంటున్నారు కాలని వాసులు. అంతుచిక్కని ఈ విషజ్వరాలు వలన ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదని ప్రజలు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం రోగులు కోదాడ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. కొందరు ఆర్ఎంపి‌లను ఆశ్రయిస్తున్నారు. వెంటనే హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story