Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది.. కీలక విషయాలను బయటపెట్టిన ఈటల (వీడియో వైరల్)

by Shiva |
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది.. కీలక విషయాలను బయటపెట్టిన ఈటల (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పటి నుంచో జరగుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు, సొంత ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2014 సంవత్సరం చివరి నుంచే ఫోన్ ట్యాపింగ్ మొదలైందని ఆరోపించారు. అయితే, తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆయనను బర్తరఫ్ చేసే సమయంలో తాము కేసీఆర్ ఎందుకు ఓ దళిత బిడ్డను పదవి నుంచి తొలగిస్తున్నారంటూ ప్రశ్నించామని తెలిపారు. అందుకు సమాధానంగా ఆయన తన దగ్గర అన్ని అధారాలు ఉన్నాయని చెప్పారని పేర్కొన్నారు. దీంతో అక్కడ నుంచి తాము అందరి ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నట్లుగా గుర్తించామని ఈటల రాజేందర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed