- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Phone Taping Case: కేటీఆర్ ఎక్కడున్నా వదిలేది లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో పింక్ పార్టీకి ఉచ్చు బిగుస్తోందని, కేటీఆర్ అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా వదిలిపెట్టేది లేదని మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే కవ్వంపల్లి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నన్ను అరెస్ట్ చేస్తే నిజాలు బయట పెడతానని ప్రభాకర్ రావు బెరిరింపులకు గురిచేయడంతో కేటీఆర్ హుటాహుటిన అమెరికా బయలుదేరి వెళ్లి, ప్రభాకర్ తో భేటీ? అని రాసుకొచ్చారు.
అలాగే తమ పేర్లు బయటకి రాకుండా తప్పించుకునేందుకు కేటీఆర్ తపత్రయపడుతున్నారని, ప్రభాకర్ రావు నెల రోజులుగా కేటీఆర్ సన్నిహితుల కస్టడిలో ఉంటున్నాడని అన్నారు. అంతేగాక పోలీసులకు దొరకద్దని, ఇండియాకు రాకుండా అక్కడే తలదాచుకోవాలని కేసీఆర్ వేడుకుంటున్నట్లు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తామని హామీ? ఇస్తున్నట్లు చెబుతూ.. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇక దీనిపై అధికార అహంకారంతో ఫోన్ ట్యాపింగ్ లు చేయించి, సొంత మనుషులను కూడా అనుమానించే పరిస్థితి తీసుకువచ్చిన కేటీఆర్ ను వదిలిపెట్టేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని, అందుకు సహకరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ఎక్స్ లో రాసుకొచ్చారు.