- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలైనయ్!.. కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: పాలన గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్కారు దవాఖానల్లో గోలీల్లేవ్ అని ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ సర్కార్ పై పలు విమర్శలు చేశారు. దీనిపై పదేళ్ల పాలనలో సర్కారు వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ అని తెలిపారు. "నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు" అనే దశాబ్దాల దుస్థితి నుంచి "చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు" అనే ధీమానిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. కానీ, రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన ఆరునెలల్లోనే సర్కారు దవాఖానాల్లో కనీసం మందు గోళీలు దొరకని దుస్థితికి దిగజార్చిందని ఆరోపించారు. అలాగే పాలన గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయినయి! అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే.. గాలిలో దీపం, స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగానికి కొత్త రూపం అని గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన పోస్ట్‌ను జత చేశారు.