- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ అరెస్ట్ వెనుక ఆ లీక్ వీరుడు ఎవరు..?.. అనుమానాలు ఎన్నెన్నో..?
దిశ, వెబ్ డెస్క్: పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాజకీయ వేడిని పుట్టించింది. మంగళవారం ఉదయం పేపర్ లీక్ అయితే ఆ రోజు రాత్రి నుంచి ఉత్కంఠ వాతావరణ నెలకొంది. మంగళవారం ఉదయం 9.30కు పేపర్ ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. అది వెంటనే సర్క్యులేట్ అయింది. అటు పొలిటికల్ లీడర్లకు సైతం చేరడంతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. విమర్శల దాడి చేశారు.
ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి హఠాత్తుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్. ఇంట్లో ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందని పోలీసులు అనుమానించారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను గుర్తించారు. ఇందులో భాగంగా మాజీ జర్నలిస్టు సంతోష్ నుంచి పేపర్ నుంచి సర్క్యులేట్ అయినట్లు నిర్ధారించారు. తొలుత ఈటల రాజేందర్‌కు అనంతరం ఆయన పీఏలకు లీకైన పేపర్ వెళ్లినట్లు తేల్చారు. వీరి తర్వాత బండి సంజయ్‌కూ, మరికొంత మందికి పేపర్ ప్రశ్నాపతం చేరిందని పోలీసులు గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. తొలుత ఆయన పేరు కొంచెం దూరంగా ఉన్నా చివరకు ఏ1గా బండిసంజయ్‌ను చేర్చారు. ఈ లీక్ వ్యవహారంలో బండి సంజయ్‌తో పాటు 10 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఇక కేసు విచారణలో బండి సంజయ్ తన నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. పక్కా ప్లాన్‌తోనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకే బండి సంజయ్ ప్రయత్నించినట్లు స్పష్టం చేశారు. బండి సంజయ్ ఫోన్ మిస్సైందని.. అది దొరికితే పూర్తి సమాచారం బయటకు వస్తుందని పోలీసులు తెలిపారు.
అయితే ఈ కేసుకు సంబంధించి చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు పేపర్ లీక్ చేసిందెవరు...?. ఓ స్కూలు నుంచి బయటకు వచ్చిందని పోలీసులు చెప్పారు కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థి లీక్ చేశారా..?, లేదా ఉపాధ్యాయులెవరైనా చేశారా అనేది ఇంకా తేలలేదు. తెలంగాణలో వరుసగా పేపర్ లీక్ ఘటనలు జరుగుతుండటంతో ఈ పేపర్ కూడా లీక్ అయితే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఎగ్జామ్‌కు ముందు నుంచే ప్లాన్ చేశారా?. లీక్ ప్రచారం చేశారని బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు లీక్ చేసిన వ్యక్తిని ఎందుకు గుర్తించలేదు. బండి సంజయ్ కంటే ముందే ఈటల రాజేందర్‌కు ప్రశ్నాపత్రం వెళ్లిందని పోలీసులు తెలిపారు. మరి ఈటలను ఎందుకు విచారించలేదు. అసలు ఈ కేసు పేపర్ లీకేజీపై పెట్టారా..? లీకేజీ అయిన పేపర్‌ను ప్రచారం చేశారని కేసు పెట్టారా? అనేది కూడా స్పష్టంగా లేదు. వీటన్నింటికీ మించి రిమాండ్ రిపోర్టు వెల్లడించిన సీపీ.. చివరలో భావిస్తున్నాం అని చెప్పారు. అంటే పూర్తి సమాచారాన్ని సేకరించలేదా..? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. వీటన్నింటికి నివృత్తి దొరకాలంటే కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం ఈ లీకేజీ వ్యవహారం మాత్రం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది.
Read more: