- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS MLA Chittem Ram Mohan Reddy :ఎమ్మెల్యే చిట్టెంకు సొంత పార్టీ నాయకుల షాక్!
దిశ, మక్తల్ : మక్తల్ బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు రాజుకున్నాయి. పార్టీలో ఆదరణ లేదని ఓ వర్గం వారు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను బహిష్కరించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఓ ముఖ్య నేత తన వర్గానికి వేడుకల్లో హాజరు కావొద్దని ఆదేశించిట్లు సమాచారం. సదరు నాయకుడు విహార యాత్రకు వెళ్లినట్లు పార్టీలో, ప్రతిపక్ష నాయకుల్లో చర్చ సాగుతోంది.
పదవులు అనుభవించి ఎమ్మెల్యే నుండి లబ్ధి పొందిన వీరు పార్టీలో తమకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకొని అసమ్మతి వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కొందరు పార్టీ నాయకులు తీసుకెళ్లిన ఆయన సున్నితంగా తోసిపుచ్చడంతో వారి ఆగడాలు మితిమీరి చివరకు పుట్టినరోజు వేడుకలను బహిష్కరించాలనే వరకు వెళ్ళినట్లు సమాచారం. అందులో భాగంగానే ఎమ్మెల్యే 60వ పుట్టినరోజు సందర్భంగా పలు ఆలయాల్లో చేపట్టని పూజ కార్యక్రమాల్లో ఓ వర్గం పాల్గొనలేదని మరో వర్గం నాయకులు చెబుతున్నారు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
చిట్టెం రామ్మెహన్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు..
మక్తల్ పట్టణంలోని పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన మృత్యుంజయ యజ్ఞంలో పుట్టినరోజు సందర్భంగా చిట్టెం రామ్మెహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చిట్టెం 60వ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఉన్న అతి పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేద పండితులు నిర్వహించిన మృత్యుంజయ హోమంలో చిట్టెం రామ్మోహన్ రెడ్డి, సుచరిత దంపతులు పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం, యజ్ఞఫలం తీసుకున్నారు. అంతకుముందు మొక్కలు పడమట ఆంజనేయస్వామి దేవాలయంలో తన పుట్టినరోజు పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణ మండలంలో ట్రై రోడ్‌లో ఉన్న ప్యానల్ స్పీకర్, దివంగత చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read more:
Chittem Ram Mohan Reddy :ఎమ్మెల్యే చిట్టెం బర్త్‌డేకు భారీ ఏర్పాట్లు