దమ్ముంటే నాపై పోటీ చెయ్.. రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్

by Javid Pasha |
దమ్ముంటే నాపై పోటీ చెయ్.. రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్‌కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. తనపై పోటీ చేస్తే తన బలమెంటో చూపిస్తానని అన్నారు. విద్వేషంతోనే తనపై రాహుల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నెత్తిపై టోపీ, గడ్డం ఉంది కాబట్టే తనపై రాహుల్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం బలమెంటో రాహుల్ నాన్నమ్మ ఇందిరాగాంధీకి తెలుసని, కానీ రాహుల్‌కు తెలియడం లేదని ఓవైసీ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story