మండుతున్న ఎండలో రోడ్డుపై ఆమ్లెట్.. తర్వాత ఏమైంది?

by Ramesh N |   ( Updated:2024-04-08 18:21:34.0  )
మండుతున్న ఎండలో రోడ్డుపై ఆమ్లెట్.. తర్వాత ఏమైంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక ఉదయం 11 దాటితే రోడ్లపైకి జనాలు కూడా రావడం లేదు. తీవ్ర వేడి గాలులు వీచే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే.. మంచి నీళ్ల బాటిల్, గొడుగు లాంటివి వెంట తీసుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

అయితే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో కొందరు యువకులు రోడ్లపై కోడి గుడ్లను పగలగొట్టి రోడ్డుపై ఆమ్లెట్ వేస్తున్నారు. ఈ ఎండ తీవ్రతకు రోడ్లు పెనంలా సలసల మాడిపోతుందని, అందుకే ఇలా రోడ్డుపై ఆమ్లెట్ వేశామని యువకులు చెప్పుకొచ్చారు. కాగా, రోడ్డుపై ఆమ్లెట్ వేసిన తర్వాత దానిపై యువకులు కారం పొడి కూడా చల్లుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed