మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందజేసిన అధికారులు

by M.Rajitha |
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందజేసిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ నది(Musi River) సుందరీకరణ పనుల్లో భాగంగా అక్రమ నిర్మాణాల గుర్తింపు, మార్కింగ్ వంటి పనులు మొదలు పెట్టారు రెవెన్యూ అధికారులు. కాగా నేడు కొన్ని ప్రాంతాల్లో సర్వే చేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇచ్చిన హామీ మేరకు ఉప్పల్ లో ఇళ్ళు ఖాళీ చేసిన నిర్వాసితులకు అధికారులు తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారు. వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించడమే కాకుండా, వారిని కొత్త ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి తాళాలు అందజేశారు. ఇళ్ళు పొందిన వారు సీఎం రేవంత్ రెడ్డికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఇళ్ళు కోల్పోయిన బాధ కంటే కొత్త ఇళ్ళు పొందామనే సంతోషమే ఎక్కువ ఉందన్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో గురువారం చాలా ప్రాంతాల్లో నిర్వాసితులు స్వచ్ఛందంగా ముందుకు తమ ఇళ్లను ఖాళీ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్నవారు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఎం హామీ మేరకు అన్ని రకాల నష్టపరిహారం అందిన తర్వాతే భూసేకరణ జరుపుతామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed