Amit Shah : కశ్మీరులో 40వేలకుపైగా హత్యలకు ఆ పార్టీలదే బాధ్యత : అమిత్‌షా

by Hajipasha |
Amit Shah :  కశ్మీరులో 40వేలకుపైగా హత్యలకు ఆ పార్టీలదే బాధ్యత : అమిత్‌షా
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ - నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిప్పులు చెరిగారు. ఆ పార్టీలు కానీ, వాటిని నడిపే కుటుంబాల మూడు భావితరాలు కానీ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేవని ఆయన పేర్కొన్నారు. కశ్మీరులో 40వేల మందికిపైగా ప్రజల హత్యలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలదే బాధ్యత.. ఉగ్రవాదంపై ప్రచారం చేస్తున్నదీ వారే అని షా మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని చెనానిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్‌షా ప్రసంగించారు.

‘‘గాంధీలు, ముఫ్తీలు, అబ్దుల్లాలు కొంతమందికే అసెంబ్లీ టికెట్లు కట్టబెట్టారు. కశ్మీరులో ఉగ్రవాదాన్ని పెంచిపోషించే వాళ్లకే టికెట్లు ఇచ్చారు. 87 మందికే ఆ మూడు కుటుంబాలు టికెట్లు ఇచ్చాయి’’ అని ఆయన ఆరోపించారు. ‘‘కొన్ని దశాబ్దాల క్రితం కశ్మీరు రక్తసిక్తమైంది. 40వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఫరూఖ్ అబ్దుల్లా లండన్‌లో విలాసవంతమైన మోటార్ సైకిల్స్ నడుపుతూ గడిపారు’’ అని అమిత్‌షా ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed