- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కనిపించకుండాపోయిన ఐదేళ్ల బాలిక మృతి.. తలలు పట్టుకుంటున్న పోలీసులు!
దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం జరిగింది. రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఐదేళ్ల బాలిక బహుళ అంతస్తుల భనవంలోని తాళం వేసి ఉన్న అపార్ట్మెంట్‌లో గల వాటర్ ట్యాంక్‌లో శవమై కనిపించింది. బాలిక కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తీరా బాలిక మృతదేహం దొరికిన తర్వాత స్థానికులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. రోడ్లను దిగ్బంధించి ఈ కేసులో ప్రమేయం ఉన్న హంతకులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా మృతదేహాన్ని కనుగొనేందుకు పోలీసులకు 3 రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
అయితే, ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలిక ఆచూకీ కోసం సుమారు 100 మంది పోలీసులు, డ్రోన్‌లు, గజఈతగాళ్ల సాయంతో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అసలు విషయానికొస్తే బాలిక మంగళవారం మధ్యాహ్నం కనిపించకుండా పోగా, రెండ్రోజుల తర్వాత పక్కింటి అపార్ట్మెంట్‌లో శవమై తేలింది. అపార్ట్‌మెంట్ భవనంలోని వందలాది మందిని పోలీసులు విచారించినప్పటికీ దొరకలేదు. అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన వస్తుందని పొరుగువారు ఫిర్యాదు చేసినా తాళం వేసి ఉన్న ఫ్లాట్‌ను ఎందుకు తెరవలేదని స్థానికులు ప్రశ్నించారు. బాలిక మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా..లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటే చిన్నారి మృతికి క్షుద్రపూజల కోణం ఏమైనా ఉందా? అని కూడా విచారిస్తున్నారు.