అదరగొట్టిన భారత కుర్రాళ్లు.. ఆసిస్‌పై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్

by Harish |
అదరగొట్టిన భారత కుర్రాళ్లు.. ఆసిస్‌పై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్
X

దిశ, స్పోర్ట్స్ : భారత అండర్-19 జట్టు అదరగొట్టింది. ఆస్ట్రేలియా-19 టీమ్‌పై వరుసగా మూడో వన్డేలోనూ నెగ్గి వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం పుదుచ్చేరి వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది. ఓపెనర్ రుద్ర పటేల్(77), కెప్టెన్ మొహమ్మద్ అమన్(71) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. హర్వాన్ష్ సింగ్(46) పర్వాలేదనిపించాడు. అనంతరం 325 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసిస్-19 జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 317 పరుగులే చేసింది. కెప్టెన్ ఒలివెర్(11), స్టీవెన్ హోగన్(104) శతకాలు బాదినప్పటికీ వారి పోరాటం ఫలించలేదు. ఆఖరి 10 ఓవర్లలో భారత బౌలర్లు మ్యాచ్‌ను తమవైపు తిప్పేసుకున్నారు. 76 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టారు. హార్దిక్ రాజ్(3/55), యుదాజిత్ గుహ(2/40), కిరణ్ చోర్మలే(2/59) రాణించారు.

Advertisement

Next Story

Most Viewed