Ram Temple : ప్రసాదం ఔట్‌సోర్సింగ్‌పై బ్యాన్ విధించాలి.. అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి డిమాండ్

by Hajipasha |
Ram Temple : ప్రసాదం ఔట్‌సోర్సింగ్‌పై బ్యాన్ విధించాలి.. అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో : తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విక్రయించే ఘీ, నూనెల స్వచ్ఛతపై సందేహాలున్నందున అన్ని ప్రముఖ ఆలయాలు ఔట్‌సోర్సింగ్ ద్వారా ప్రసాదాన్ని తయారు చేయించే ప్రక్రియపై పూర్తి నిషేధం విధించాలని ఆయన కోరారు. ‘‘ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే ప్రసాదం తయారీ జరిగేలా చూడాలి. కేవలం అలాంటి ప్రసాదాన్నే దేవతలకు నైవేద్యంగా సమర్పించాలి’’ అని ఆచార్య సత్యేంద్ర దాస్ సూచించారు.

దేవతలకు నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్థాల్లో మాంసం, కొవ్వులను కలపడం ద్వారా హిందూ ఆలయాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేశంలో విక్రయించే నూనెలు, ఘీ స్వచ్ఛతను పకడ్బందీగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై సమగ్ర దర్యాప్తు జరగాలని సాధువులు, భక్తులు కోరుకుంటున్నారని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed