తెలుగు ఛానల్‌లో అశ్లీల వీడియో.. సిబ్బంది రియాక్షన్ ఇదే!

by GSrikanth |
తెలుగు ఛానల్‌లో అశ్లీల వీడియో.. సిబ్బంది రియాక్షన్ ఇదే!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఓ శాటిలైట్ ఛానల్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత న్యూడ్ వీడియోలు ప్రసారం కావటం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 28వ తేదీన రాత్రి 12 గంటల సమయం దాటిన తర్వాత బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-12 కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు శాటిలైట్ ఛానల్‌లో 15 నిమిషాలపాటు ఈ బూతు పురాణం ప్రసారమయ్యింది. బయటి నుంచి ఫోన్లు రావటంతో సిబ్బంది ప్రసారాలను ఆపివేశారు. తమ ఛానల్ సర్వర్ హ్యాక్ అయ్యిందంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story