BREAKING: ఓటు హక్కు వినియోగించుకున్న NTR, అల్లు అర్జున్, వెంకయ్యనాయుడు

by Satheesh |   ( Updated:2024-05-13 02:05:27.0  )
BREAKING: ఓటు హక్కు వినియోగించుకున్న NTR, అల్లు అర్జున్, వెంకయ్యనాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు ఉప ఎన్నికకు సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మొదలైంది. పోలింగ్‌కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించారు.

ఈ నేపథ్యంలోనే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బూత్‌ల వద్దకు చేరుకుని ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో నిల్చున్నారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లో ఓటేశారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి బర్కత్‌పురాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ దంపతులు జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌‌లో ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

Advertisement

Next Story