జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏమీ లభించలేదు: ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత

by Mahesh |
జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏమీ లభించలేదు: ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర సమీపంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్(Janwada Farmhouse) వద్ద ఆదివారం ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాల (Raj Pakala) ఆధ్వర్యంలో ఓ పార్టీ నిర్వహించారు. పామ్ హౌస్‌ ఎటువంటి పర్మీషన్ లేకుండా పార్టీ జరుగుతుందనే సమాచారంతో రైడ్ చేయగా.. విదేశీ మద్యం పట్టుబడింది. దీంతో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓరియన్ విల్లాస్‌‌లోని నెంబర్ 40 విల్లాలో నివాసం ఉంటున్న రాజ్ పాకాల ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ (Excize Enforcement Team) సోదాలు నిర్వహించారు.

అలాగే జన్వాడ ఫామ్ హౌస్ లో వద్దకు ఎక్సైజ్‌ అధికారులు పెద్దమొత్తంలో చేరుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకుని.. అధికారులను పూర్తిగా చెక్ చేసినాకే లోపలికి పంపుతామని అడ్డం పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అనంతరం జన్వాడ ఫామ్ హౌస్ లోకి వెళ్లిన ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం బయటకు వచ్చాక.. చేవెళ్ల ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత(Excise Inspector Srilatha) మీడియాతో మాట్లాడారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏమీ లభించలేదని చెప్పుకొచ్చారు. అలాగే శివారు ప్రాంతం కాబట్టి ఎక్సైజ్‌ నిబంధనలు పాటించాలని.. అలా పాటించలేదు కాబట్టి.. కేసు నమోదు చేశామని ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత అన్నారు.

Advertisement

Next Story

Most Viewed