- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఎన్ని కుట్రలు చేసిన మళ్లీ మేమే గెలుస్తాం : మంత్రి కోమటిరెడ్డి
దిశ , జహీరాబాద్: వెంటనే ప్రభుత్వాన్ని పడగొట్టి రాజులై, యువరాజులై ధరణి లాంటి లోపు భూయిష్ట చట్టాలతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి, వెంకటరెడ్డి అన్నారు. గురువారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి జహీరాబాద్ లో ఉజ్వల్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఏం ధోకాలేదని మళ్లీ తామే గెలుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గమైన జహీరాబాద్ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా గ్రామాల నుంచి మండల్ హెడ్ క్వార్టర్ కు అదే విధంగా మున్సిపాలిటీ అప్రోచ్ కు రోడ్లన్నింటిని బీటీ గా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ కు వచ్చే రోడ్డు ను డబుల్ రోడ్డులుగా వచ్చే నాలుగేళ్లలో నిర్మిస్తామన్నారు.
రూ.15 కోట్లు తో నియోజకవర్గంలోని చిరాగ్ పల్లి నుంచి మన్నాపూర్ వరకు బీటీ రోడ్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని వారంలోపు పనులు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా రూ.32 కోట్లతో ఎల్గోయి నుంచి జహీరాబాద్, రూ. 25 కోట్లతో అసద్ గంజ్ నుంచి జాతీయ రహదారి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శాంక్షన్ తీసుకుంటామన్నారు. పది రోజుల్లో పాత గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రూ.4 కోట్ల తో కొత్త గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. పాత డిజైన్లతోనే సుందరంగా మోడల్ గా
నిర్మించుకుందామన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని మరో నియోజకవర్గమైన నారాణ్ ఖేడ్ ప్రాంతంలో కూడా రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించి రూ.7 లక్షల కోట్లు స్నో , పౌడర్, కూలిపోయే ప్రాజెక్టులకు మాత్రమే అప్పులు చేశారని ఆరోపించారు. మిషన్ భగీరథకు చేసిన రూ.50 వేల కోట్లు అప్పులను అసలుతో పాటు మిత్తులు తామే భావిస్తున్నామన్నారు. ఇంటింటికీ నల్ల ఏ మేరకు వస్తుందో అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. గత పాలకులు నిర్మించిన అన్ని ప్రాజెక్టులు కట్టుడు, కూల్చుడు అయిపోయిందన్నారు. దీనికి అసలు, మిత్తి చెల్లింపులు మాత్రం మాకు తప్పడం లేదన్నారు. అభివృద్ధికి చిహ్నం గా నిలిచే రోడ్లను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
రోడ్ల లో కమిషన్ రానందనే..
గత పాలకులు రోడ్లలో కమిషన్ రాదని వారు వాటిని పట్టించుకోలేదన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన యంత్రాన్ని ఉపయోగించి వర్షాకాలంలో ఏర్పడిన భారీ గుంతల పూడ్చివేతను చేపట్టామన్నారు. దీంతో ప్రతిరోజు 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మించవచ్చన్నారు. జహీరాబాద్- వికారాబాద్ జాతీయ రహదారి ప్రపోజల్ పెండింగ్లో ఉందని కేంద్ర మంత్రి ఘట్కరితో సంప్రదించి మంజూరు తీసుకొని పనులు ప్రారంభిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో ఈ పనులు పూర్తి చేసి హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రాణాలిక రూపొందించామన్నారు. లక్ష కోట్ల ఓఆర్ ఆర్ రోడ్డును రూ.7వేల కోట్లకే అమ్ముకుని ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పిన దరిద్రపు ప్రభుత్వం కేసీఆర్ దన్నారు. ఆర్థిక విధ్వంసంలో సిద్ధహస్తుడైన కేసీఆర్ పాలనను కాదని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో పైసా పైసా కూడబెట్టి క్రమ పద్ధతిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
జహీరాబాద్ లో ..యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల
జహీరాబాద్ లో కూడా 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను నిర్మించనున్నట్లు చెప్పారు. అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ స్కూలు అన్ని కులాల వారు ఉంటారన్నారు. మూసీ దుర్వాసనతో రకరకాల వ్యాధులతో హైదరాబాద్ , రంగారెడ్డి ఏరియా జిల్లా వాసులు రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ముసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతిపక్షం వీటిని ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇబ్రహీంపట్నంలో ఒకే చోట వేయి కంపెనీలు పెట్టడం సరికాదని అప్పట్లో తాము చేసిన పోరాటం ఫలించిందని, ఈ సందర్భంగా ఏ ఒక్క అధికారిపై దురుసుగా ప్రవహించలేదన్నారు.. వేల మందితో వందల సార్లు ఆందోళన కార్యక్రమాలు చేశామని , ఒక చిన్న ఉద్యోగిపై కూడా దురుసుగా ప్రవహించలేదన్నారు.
నిజాం రాజు లాగా..
నిజం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని విస్మరించి రాజరికపు పోకడలతో తాను తన సంతానం తన రాబోవు తరాలు రాష్ట్రాన్ని పాలించాలని భావించిన కేసీఆర్ ను ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ లో తగిన బుద్ధి చెప్పారన్నారు. దీంతో ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. పలు చట్ట విరుద్ధ కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారన్నారు. చట్టం ఎవరిని వదిలిపెట్టదని, తనపని తాను చేసుకుని పోతుందన్నారు. ఏకంగా ఐఏఎస్ అధికారులపై దాడులుచేసే స్థాయికి దిగజారారని ఆరోపించారు. చట్టం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విచారణ పూర్తి కాగానే అందరి మీద చర్యలు తీసుకుంటామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా జహీరాబాద్ వచ్చిన సందర్భంగా స్థానిక నేతలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా స్వాగతించారు.