పూల బొకేలు, శాలువాలు వద్దు.. శ్రేయోభిలాషులకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి

by Prasad Jukanti |
Kishan Reddy Urges CM KCR to allot land for Ramagundam ESI Hospital
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న వారికి కీలక విజ్ఞప్తి చేశారు. నన్ను కలవడానికి వచ్చే మిత్రులు, శ్రేయోభిలాషులందరు దయచేసి పూలబోకేలు, శాలువాలు స్వీట్లు తీసుకురావొద్దు. ఇది నా వినమ్ర పూర్వకమైన అభ్యర్థన. వీటికి బదులుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్ లు లేదా స్పూర్తిదాయకమైన కథల పుస్తకాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా ద్వారా ఈ విజ్ఞప్తిని చేశారు. కిషన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గ్రేట్ డెసిషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మోడీ3.0 కేబినెట్లో కిషన్ రెడ్డి మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలోనూ ఆయన మంత్రిగా సేవలందించారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed