- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ మూడో జాబితా రిలీజ్.. జనసేన సీట్లపై నో క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్ అయింది. 35 మంది అభ్యర్థులతో థర్డ్ లిస్ట్ విడుదల చేయగా.. ఇందులో పాత నేతలతో పాటు కొంతమంది కొత్తవారికి కూడా అవకాశం దక్కింది. అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. మూడో జాబితాతో జనసేనకు కేటాయించే సీట్లపై క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ జనసేన సీట్లపై ఎలాంటి క్లారిటీ రాలేదు. జనసేనకు 10 నుంచి 12 సీట్లను బీజేపీ కేటాయించనుందనే ప్రచారం జరిగింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, వైరా, అశ్వరావుపేట, ఖమ్మం సీట్లను కేటాయిస్తారనే వార్తలొచ్చాయి.
జనసేన 20 నుంచి 25 సీట్లను ఆశించింది. కానీ చివరికి 10-12 సీట్లను ఇచ్చేందుకు బీజేపీ అంగీకారం తెలిపింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి పోటీ చేయడంపై చర్చలు జరిపారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఎన్డీయేలోనే పవన్ ఉండటంతో.. తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీని కలుపుకోవాలని బీజేపీ భావించింది. అందులో భాగంగా పవన్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.