కాంగ్రెస్‌తో పొత్తుపై సీపీఐ నుంచి నో క్లారిటీ.. వీడని సస్పెన్స్

by Javid Pasha |
కాంగ్రెస్‌తో పొత్తుపై సీపీఐ నుంచి నో క్లారిటీ.. వీడని సస్పెన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న ఎన్నికల్లో పొత్తుపై సీపీఐ తర్జనభర్జన పడుతోంది. కలిసి వెళ్లారా? లేదా? అనే దానిపై తేల్చుకోలేకపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు లేదని, ఒంటరిగా పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించగా.. సీసీఐ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం హైదరాబాద్‌లో సీపీఐ విస్తృతస్థాయి మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై సుదీర్ఘంగా చర్చించగా.. నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశంతో కాంగ్రెస్‌తో పొత్తుపై ఏదోకటి తేల్చేస్తారని అనుకున్నారు. కానీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. మరోసారి కాంగ్రెస్‌తో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

శనివారం మరోసారి సీపీఐ రాష్ట్ర నేతలు భేటీ కానున్నారు. తొలుత కొత్తగూడెంతో పాటు చెన్నూరు టికెట్‌ను సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది. అయితే వివేక్ వెంకటస్వామి పార్టీలో చేరడంతో ఆయనకు కాంగ్రెస్ చెన్నూరు టికెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగూడెం సీటు ఒక్కటే తీసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని సీపీఐ నేతలు భావిస్తున్నారు. దీనికి బదులు సీపీఎంతో కలిసి పోటీ చేస్తేనే మంచిదని కొంతమంది నేతలు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story