- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోచారం కుటుంబ అరాచకం నుంచి బాన్సువాడకు విముక్తి కల్పిస్తా: యెండల లక్ష్మీనారాయణ
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బాన్సువాడ ప్రజలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ అరాచక, అక్రమ పాలన నుంచి విముక్తి కల్పిస్తానని భారతీయ జనతా పార్టీ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం బిజెపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా, ప్యాడి మాఫియా కొనసాగుతుందని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగబద్ధ పదవి అయిన స్పీకర్ పదవిలో ఉండి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం దారుణం అన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ పోచారం కుటుంబం పిడిఎస్ దందాతో పాటు ప్యాడి దందాలో బినామీలుగా కొనసాగుతున్నారన్నారు. ఎలక్షన్ కమిషన్ సీఎంఆర్ కేటాయింపుల విషయంలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గాన్ని రెండు జిల్లాలకు విభజించి ఇద్దరు తనయులకు అప్పగించారని ఆరోపించారు. మైనింగ్ మాఫియాను ప్యాడి మాఫియాను కనుసన్నుల్లో శాసిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో స్పీకర్లను మరోసారి అసెంబ్లీకి పంపించిన చరిత్ర ఎన్నడు లేదని. ఈ విషయంలో బాన్సువాడ ప్రజలు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈసారికి సన్ స్ట్రోక్ చూపిస్తానని ఎండ లక్ష్మీనారాయణ అన్నారు.