- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
road service : ఆ బీటీ రోడ్డు వంకరలు ఎందుకు తిరిగిందో...?
దిశ ,ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్మూర్ ఏరియాలో మున్సిపల్ 5 వ వార్డులో, ఆర్మూర్ మున్సిపల్ అన్ని వార్డుల్లో బీటీ రోడ్ల,డివైడర్,సెంట్రల్ లైటింగ్ పనుల కోసం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పటి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి,ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి టి యు ఎఫ్ ఐ డి సి నిధులను మంజూరు చేయించారు. ఈ నిధుల్లోంచి మున్సిపల్ 5వ వార్డ్ పరిధిలోని పెద్ద కాపు రాజు ఇంటి నుంచి కాంతి స్కూల్ వరకు, కాంతి స్కూల్ నుంచి లిమ్రా సామిల్ (63 నంబర్ జాతీయ రహదారి) వరకు 50,40 లక్షలతో మొత్తం 90 లక్షల టి యు ఎఫ్ ఐడిసి నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు మంజూరయ్యాయి. కానీ నిర్మల్ రోడ్డు నుంచి కాంతి స్కూల్ దాటి రాజరాజేశ్వర అపార్ట్మెంట్ దాటిన వెంటనే రోడ్డు ఎందుకు వంకరలు తిరిగిందో ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. దాదాపు 2 సంవత్సరాలుగా అలానే ఉందని స్థానికులు తెలిపారు. ఈ బీటీ రోడ్డును మంజూరైనట్టు కాకుండా వేరే విధంగా వంకరలు తిప్పుతూ ..ఎల్ఐసి గిరిధర్, అల్జాపూర్ మహేందర్ లకు లబ్ధి చేకూరేలా..మంజూరుకు విరుద్ధంగా బీటీ రోడ్డును వంకరలు తింపి నిర్మించారు. గతంలో మంజూరైన ప్రకారం బిటి రోడ్డున నిర్మించకుండా వేరే వ్యక్తుల ప్రయోజనార్థం బిటి రోడ్డును సదరు కాంట్రాక్టర్ వంకరలు తింపే సమయంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డి ఈ, ఏ ఈ ఏం చేశారని ఐదో వార్డు పరిధిలోని మహాలక్ష్మి కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. సుమారు సంవత్సరం క్రితం రోడ్డు మంజూరైన తరహాలో రోడ్డు నిర్మాణం చేయించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ కు మహాలక్ష్మి కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి మహాలక్ష్మి కాలనీవాసులు ఏడాది అవుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహాలక్ష్మి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ రోడ్డును వంకర తింపడంలో కాంట్రాక్టర్ ఉద్దేశం ఏంటని వెంటనే..రోడ్డు వంకర తిప్పేందుకు దాని వెనుక ఎవరు ఎవరు ఉన్నారనే విషయం తమకు తెలపాలని మహాలక్ష్మి కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంజూరైన విధంగా బీటీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసులు మున్సిపల్ పాలకవర్గ సభ్యులను,అధికారులను డిమాండ్ చేస్తున్నారు.