వివేక్ వెంకట్ స్వామికి ఘన స్వాగతం

by Sridhar Babu |   ( Updated:2023-08-19 10:08:51.0  )
వివేక్ వెంకట్ స్వామికి ఘన స్వాగతం
X

దిశ, ఆర్మూర్ : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి శనివారం ఆర్మూర్లో బీజేపీ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికి సన్మానం చేశారు. నిర్మల్ లో బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షకు సంఘీభావంగా నిర్మల్ వెళ్తుండగా మార్గ మధ్యలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్మూర్లో కొద్దిసేపు ఆగిన సందర్భంలో ఆర్మూర్ బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం చేశారు. సన్మానం చేసిన వారిలో ఆర్మూర్ బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, గుర్రం విజయానంద్, మిరియాకార్ కిరణ్ ఉన్నారు.

Advertisement

Next Story