- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుబాటులోకి మరిన్ని ఆధునిక సదుపాయాలు..
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగర ప్రజలకు త్వరలోనే మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగరమేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమీకృత జిల్లాకార్యాలయాల సముదాయానికి (న్యూ కలెక్టరేట్) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐటీ హబ్ ను సందర్శించి, పనుల ప్రగతి గురించి అధికారులు, కాంట్రాక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తుదిదశకు చేరుకున్న పనులను వేగవంతంగా చేపడుతూ, యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యానికి ఎంతమాత్రం తావులేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకుని ఏకకాలంలో జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. అనంతరం ఐటీ హబ్ కు చేరువలో నిర్మిస్తున్న దుబ్బ వైకుంఠధామం పనులను, నగరపాలక సంస్థ నూతన భవన సముదాయాన్ని, ఖలీల్ వాడి, అహ్మదిబజార్ సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ యార్డులు, కోటగల్లి, ఖిల్లా, అర్సపల్లి వైకుంఠ ధామాల పనులను, రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. నిధులు అందుబాటులో ఉన్నందున పనులను వేగవంతంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా కృషి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదార్లకు సూచించారు.
మరో నెలన్నర రోజుల్లోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. ప్రతిచోటా పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రారంభోత్సవాలు నాటికి ఏ చిన్నపని కూడా పెండింగ్ లో ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాలగణేష్ గుప్తా మాట్లాడుతూ కోట్లాది రూపాయల వ్యయంతో నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వచ్చే మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామాత్యులు కే.తారకరామారావు చేతుల మీదుగా ప్రాంరంభోత్సవాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పై పనులు పూర్తయిన మీదట నగరప్రజలకు అధునాతన వసతులతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, వారికి అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. వీరి వెంట వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.