కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు

by Naveena |
కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు
X

దిశ,బాన్సువాడ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా, నిరసన నిర్వహించారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ ను నిండు పార్లమెంటు సభ లో కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి పదవిలో ఉండే అర్హతలేదని వెంటనే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్‌పై పార్లమెంట్ సభలో అవహేళనగా అమిత్‌షా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, బీర్కూర్, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్లు శ్యామల, సురేష్, ఎజాస్, బాబా, అంజిరెడ్డి, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed