- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ కార్యకర్తపై దాడి.. పరిస్థితి సీరియస్
దిశ, మెట్ పల్లి : తన పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో మెట్ పల్లి పట్టణ రేగుంట రైల్వే బ్రిడ్జి వద్ద మహమ్మద్ రజాక్ అనే వ్యక్తిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రజాక్ అనే కాంగ్రెస్ కార్యకర్త దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పలు కార్యక్రమాలకు పాల్గొంటూ సేవలందిస్తూ బుధవారం నిజామాబాద్ లో జరిగిన బీసీ గర్జన కార్యక్రమం లో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో తన స్వగ్రామం ,అయిలాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అది గమనించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రేగుంట రైల్వే బ్రిడ్జి వద్ద కాపు కాసిన కొందరు మహమ్మద్ రజక్ పై దాడికి పాల్పడి పరారయ్యారు. స్పృహ తప్పిపోయి పడిపోయిన రజాక్ ను కొందరు గమనించి స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చినా స్థానికుల సాయంతో రజాక్ ను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందంటూ నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రజాక్ కోమాలో ఉన్నట్టు ఆఫీస్ ఇంచార్జ్ సరిఫుద్దీన్ తెలిపారు.