- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ లో బిజేపికి ఉహించని షాక్....టీఆర్ఎస్‌లోకి బీజేపీ ఎంపీటీసి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ లో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లు పర్యటనలు ముగిసిన మూడు రోజులైన తిరగక ముందే బిజేపికి గట్టి షాక్ తగిలింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, పీయూసీ చైర్మన్ , ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీజేపీ నందిపేట ఎంపీటీసీ -2 అరుణ చవాన్ టీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల ఆర్మూర్ లో పర్యటించిన ఎంపీ అరవింద్ ను స్థానిక పసుపు రైతులు అడ్డుకున్నారు. పసుపు బోర్డు హామీని నెరవేర్చాలంటూ ఎంపీ అరవింద్ ను నిలదీసారు. దీంతో కొందరు అరవింద్ మనుషులు రైతులపై దాడికి ప్రయత్నించారు. అయితే అరవింద్ ను అడ్డుకున్న పసుపు రైతులను ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చిన ఎంపీ బండి సంజయ్, ఆర్మూర్ లోని నందిపేటలో పర్యటించారు.
రైతులను ఉగ్రవాదులతో పోల్చి రాజకీయ లబ్ధి కోసం తమ గ్రామంలో పర్యటించిన బండి సంజయ్ తీరును గ్రామ బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు. బీజేపీ రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా గ్రామ ఎంపీటీసీ, ఇతర బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. నందిపేట ఎంపీటీసీ 2 అరుణ ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ జెడ్పీటీసీ యమున ముత్యం,ఎంపీటీసీ మురళి,టిఆర్ఎస్ పార్టీ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్,సిలిండర్ లింగం తదితరులు పాల్గొన్నారు.